హాయ్ ఈ రోజు కొంచెం కొత్తగా సరదాగా తెలుగులో వంట చేసే విధానం నేర్చుకుందాం ....... కావలసినవి:
గోధుమ పిండి-రెండు కప్పులు
మంచి నీళ్లు-తగినన్ని
ఉప్పు-తగినంత
నూనె-తగినంత
పరాటాలోకి కావలసినవి:
కాలిఫ్లవర్ తురుము-రెండు కప్పులు
పచ్చిమిర్చి-రెండు
సన్నగా తురిమిన కొత్తిమీర-ఒక స్పూన్
గరం మసాల-ఒక స్పూన్
కారం-అర స్పూన్
ఉప్పు-తగినంత
తయారుచేయు విధానం:
గోధుమ పిండి జల్లించి ఉప్పు,నీళ్లు వేసి చపాతీ పిండిలా కలపాలి.
కొత్తిమీర,పచ్చిమిర్చి,ఉప్పు,తురిమిన కాలిఫ్లవర్ అన్నీ బాగా కలిపి నీళ్లు పిండేయాలి.(పిండిన నీళ్లు గోధుమ పిండిలోకలిపేందుకు వాడొచ్చు.)
ఇందులో గరం మసాల,కారం వేసి బాగా కలపాలి.
పరాత పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి.
ఒక్కో ముద్దనీ పూరీల వత్తాలి.
దాని మద్యలో కాలిఫ్లవర్ తురుము మిశ్రమాన్ని ఉంచి పూరి అంచుల పైకి మడవాలి.
దీన్ని మెల్లగా వేత్తుతూ చపాతిలా చేయాలి.
ఈ పరాతలని నూనె వేస్తూ పెనం మీద కాల్చాలి.
చిట్కా:నిమ్మకాయలు ప్రిజ్లో ఉంచి నిలువ పెట్టే కన్నా వాటిని ఒక పాత్రలో కొంచెం చల్లని నీరు పోసి దాచి ఉంచితే వడలిపోవు ఐతే పాత్రలో నీరు మాత్రం రోజూ మారుస్తూ ఉండాలి.
1 comments on "పరాత"
Hi Sandhya.. It's very pleasant surprise to see your post in telugu. Paratha is very tasty, regular chapathi thini thini bore kottindi. This variety chapathi is very like-able to all. Thanks for the recipe.. Appudapudu telugu lo palakaristhe we andhras will be very happy..
Post a Comment