పండుగ సందర్బంగా రుచితో పాటు పోషక విలువలున్న క్యారెట్ పాయసం ఎలా తయారుచేయాలో చూద్దాం..
తయారుచేయు విధానం:
క్యారేట్ని శుభ్రం చేసి చిన్న ముక్కలుగా తరగాలి.
తరువాత తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి,తరువాత మిక్సీలో వేసి ముద్దగా చేసుకోవాలి.
ఇప్పుడు పాలని బాగా మరగనివ్వాలి,మరిగిన తరువాత క్యారెట్ ముద్దని వెయ్యాలి.
తరువాత పంచదార వేసి బాగా కలపాలి. యాలకుల పొడి కూడా వెయ్యాలి.చివరగా జీడిపప్పు వేఇంచి దీనిలో కలిపితే రుచికరమైన , ఆరోగ్యకరమైన పాయసం రెడీ...

చిట్కా: అరటి కాయలు వంకాయలు కోసిన కాసేపటికే రంగు మారి కసరుగా మారతాయి. అయితే కోసిన వెంటనే కొంచెం మజ్జిగ కలిపిన నీటిలో వేసి ఉంచితే ముక్కలు అలా కాకుండా ఉంటాయి
1 comments on "క్యారెట్ పాయసం"
ముద్దు గారే యశోద ముంగిట ముత్యము వీడు
దిద్దరాని మహిమల దేవకీ సుతుడు
అంతనింత గొల్లెతల అరచేతి మాణిక్యము
పంతమాడే కంసుని పాలి వజ్రము
కాంతుల మూడు లోకాల గరుడపచ్చా పూస
చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు
రతికేళి రుఖ్మినికి రంగుమోవి పగడము
మితి గోవర్ధనపు గోమేధికము
సతమై శంఖచక్రాల సందుల వైదూర్యము
గతియై మమ్ము గాచే కమలాక్షుడు
కాళింగుని తలలాపై గప్పిన పుష్యరాగము
యేలేటి శ్రీ వేంకటాద్రి ఇంద్రనీలము
పాలజలనిధిలోన బాయని దివ్య రత్నము
బాలునీవలె దిరిగే పద్మనాభుడు
On this Happy Occasion of Krishnashtami, We enjoyed every moment with the sweetness of Carrot payasam.. Thank you Sandhya!!
Post a Comment